నేవీ కమాండర్స్ కాన్ఫరెన్స్ రేపు ప్రారంభం కానున్నది. ఐఎన్‌ఎస్ విక్రాంత్ లో సముద్రం మధ్యలో కమాండర్ల సమావేశం జరగడం ఇదే తొలిసారి. ఐదురోజుల పాటు జరిగే సదస్సులో తొలిరోజు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేవీ టాప్ కమాండర్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గత ఆరు నెలల్లో నేవీ చేసిన కార్యకలాపాలు, లాజిస్టిక్స్, శిక్షణ, మానవ వనరులు, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించనున్నారు. కమాండర్లు హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న కార్యకలాపాలపై సైతం చర్చించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇంతకు ముందు 2015లో ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో జాయింట్ కమాండర్ల సదస్సు జరగ్గా.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి, ప్రసంగించారు. ఐఎన్‌ఎస్ విక్రాంత్ నేవీలో చేరి ఆరు నెలలు గడుస్తున్నది. ప్రస్తుతం దానిపై మోహరించే యుద్ధ విమానాల ట్రయల్స్ కొనసాగుతున్నాయి.
ఐఎన్ఎస్ విక్రాంత్‌లో నేవీ కమాండర్స్ కాన్ఫరెన్స్
March 05, 2023
0
Tags