ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ మొదటి, మూడో సెమిస్టర్ పరీక్షలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం పొలిటికల్ సైన్స్ సైకాలజీ, కెమిస్ట్రీ విద్యార్థులకు పేపర్ -1, బీబీఏ, బీసీఏ విద్యార్థులకు పేపర్ -2 పరీక్షలకు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అనంతపురం జిల్లాలోని ఎస్వీ డిగ్రీ కాలేజీ, ఎస్‌ఎల్‌ఎస్ డిగ్రీ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడ్డారు. ఓ విద్యార్థిని చున్నీపై పెన్నుతో సమాధానాలు రాసుకొని వచ్చింది. పలువురు విద్యార్థులు చేతులపై సమాధానాలు రాసుకుని ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వేసుకొచ్చారు. అయితే విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడటం గమనించిన ఇన్విజిలెటర్లు వాళ్లను పట్టుకున్నారు. ఆయా విద్యార్థులను డిబార్ చేశారు. అనంతపురంలో ఐదుగురు, తాడిపత్రిలో ఒక విద్యార్థి డిబార్ అయినట్లు పరీక్షల విభాగం సంచాలకుడు ఆచార్య జీవీ రమణ వెల్లడించారు.
ఆరుగురు విద్యార్థులు డిబార్ !
March 16, 2023
0
Tags