డీలిమిటేషన్‌ పిటిషన్‌ను కొట్టేవేత !

Telugu Lo Computer
0


కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ము కాశ్మీర్‌లోని అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లు కోర్టు ముందు పెండింగ్‌లో ఉండగా జమ్ముకాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టంపై తీర్పును ప్రకటించలేమని కోర్టు ధర్మాసనం పేర్కొన్నది. జమ్ముకాశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 107 నుంచి 114 కు పెంచడాన్ని సవాల్ చేస్తూ శ్రీనగర్‌కు చెందిన హాజీ అబ్దుల్ ఘనీ ఖాన్, డాక్టర్ మహ్మద్ అయూబ్ మట్టూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇలా అసెంబ్లీ స్థానాలు పెంచడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 81, 82, 170, 330 సెక్షన్‌లకు విరుద్ధమని వారు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలనును జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకా తో కూడిన ధర్మాసనం విన్నది. డిసెంబర్ 1న తీర్పును రిజర్వ్ చేసింది. జమ్ముకాశ్మీర్‌ లో ఆర్టికల్‌ 370 రద్దు పిటిషన్‌ రాజ్యంగ ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉన్నదని, ఆ పిటిషన్‌ను విచారించిన తర్వాతగానీ డీలిమిటేషన్‌ పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది. దాంతో డీలిమిటేషన్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ కొట్టేస్తూ నిర్ణయం తీసుకున్నది. కాగా, పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ తన వాదనలు వినిపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)