భారత జట్టు స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని కలిశారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోను రాజస్థాన్ రాయల్స్ తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది. ఈ ఫొటోను పంచుకుంటూ, రాజస్థాన్ రాయల్స్ చాలా ఆసక్తికరమైన క్యాప్షన్ అందించింది. ఫొటోలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మధ్యలో నిలబడి ఉండగా, అతనికి ఒక వైపు చాహల్, మరో వైపు భార్య ధనశ్రీ వర్మ నిలబడి ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఈ ఫొటోను షేర్ చేస్తూ, 'RR మీట్స్ RRR' అనే క్యాప్షన్‌లో అందించింది. చాహల్ రాజస్థాన్ తరపున IPL ఆడుతున్నాడు. ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ను చాహల్ గెలుచుకున్నాడు. చాహల్ 17 మ్యాచ్‌ల్లో 19.51 సగటుతో మొత్తం 27 వికెట్లు పడగొట్టాడు. ఇందులో, అతని ఎకానమీ రేటు 7.75గా నిలిచింది.
ఆరార్ ను కలిసిన ట్రిపులార్ !
February 12, 2023
0
Tags