బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మూడు నెలల తర్వాత స్వదేశానికి చేరుకున్నారు. కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన గతేడాది డిసెంబర్‌లో చికిత్స నిమిత్తం సింగపూర్ వెళ్లారు. అక్కడ లాలూకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. కుమార్తె రోహిణి ఆచార్య కిడ్నీని సింగపూర్ వైద్యులు లాలూకు విజయవంతంగా అమర్చారు. ఆపరేషన్ అనంతరం అక్కడే కోలుకుంటున్న లాలూ.. శనివారం రాత్రి భారత్ చేరున్నారు. ఢిల్లీలోని విమానాశ్రయంలో ఆయనను చూసేందుకు కార్యకర్తలు, అభిమానాలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా అభిమానులకు అభివాదం చేస్తూ తన నివాసానికి వెళ్లిపోయారు. అంతకుముందూ లాలూ కుమార్తే రోహిణి ఆచార్య ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 'మన అధినేత లాలూజీ ఆరోగ్యం గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నాన్న ఫిబ్రవరి 11న సింగపూర్ నుంచి ఇండియా వెళ్తున్నారు. కూతురిగా నా డ్యూటీ చేస్తున్నాను. నాన్నను ఆరోగ్యంగా పంపిస్తున్నాను. ఇప్పుడు మీరంతా మా నాన్నని జాగ్రత్తగా చూసుకోండి. ఆపరేషన్ తర్వాత నాన్నకు ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఇండియాకు వచ్చిన తర్వాత లాలూను కలిసే వారంతా మాస్క్ ధరించాలని కోరుతున్నా' అని రోహిణి ఆచార్య ట్వీట్ చేశారు.
స్వదేశానికి వచ్చిన లాలూ ప్రసాద్ యాదవ్
February 12, 2023
0
Tags