మధ్యప్రదేశ్ లోని ఒక చర్చికి దుండగులు నిప్పు పెట్టారు. లోపలి గోడలపై మతపరమైన రాతలు రాశారు. నర్మదాపురం జిల్లా చౌకీ పురా గ్రామంలో ఈ క్రైస్తవ మందిరం ఉంది. ఆదివారం అర్ధరాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కిటికీ తెరిచి చర్చిలోకి వచ్చి లోపల వస్తువులను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. అంతేకాకుండా మతపరమైన రాతలు కూడా రాశారు. మరి కొన్ని వస్తువులను ధ్వంసం చేశారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అటు ఖాండ్వాలోనూ కొంతమంది ఓ ముస్లిం ఇంట్లో బలవంతంగా హనుమంతుడి విగ్రహాన్ని ఉంచారు. దీంతో అక్కడ రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. పోలీసులు లాఠీ ఛార్జ్ చేయటంతో నలుగురు గాయపడ్డారు.
చర్చికి నిప్పు పెట్టిన దుండగులు
February 13, 2023
0
Tags