బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో పటిష్టమైన బందోబస్తు !

Telugu Lo Computer
0


బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉగ్రవాద నియంత్రణ చర్యలకు మరింత పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయదలిచారు. ఇటీవలే ఆరంభమైన రెండో టర్మినల్‌కు సమగ్ర భద్రత కల్పించేందుకై 1700మంది సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) బలగాలను కేంద్రప్రభుత్వం కేటాయించినట్టు సమా చారం. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో 3,500మంది విధులు నిర్వహిస్తున్నారు. అదనంగా 1700మందిని నియమించారు. సీఐఎస్‌ఎఫ్‌ బలగాలు టర్మినల్‌ 1, 2 లలోనూ పనిచేయనున్నారు. ప్రయాణీకులను పరిశీలించడం, కేబిన్‌లో లగేజీని స్కాన్‌ చేయడంతోపాటు సమగ్ర తనిఖీలు, యాంటి హైజాక్‌, ఉగ్రవాద దాడు ల నియంత్రణను పర్యవేక్షించనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవం బరులో టర్మినల్‌-2ను ఆరంభించారు. ఇటీవలే ఇది అందుబాటులోకి వచ్చింది. రెండో టర్మినల్‌ను 5వేల కోట్లతో నిర్మించగా పూర్తిస్థాయిలో పర్యావరణ స్నేహిగా తీర్చారు. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు ఏటా ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలు పెరి గాయి. దీంతో భద్రత మరింత పెంచే దిశగా అదనపు బలగాలను కేటాయించారు. ఇదే తరహాలోనే ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌కు 1400మందిని కేటాయించినట్టు సమాచారం. 

Post a Comment

0Comments

Post a Comment (0)