లక్నో నుంచి కోల్‌కతా వెళ్లే ఎయిర్ ఏషియా విమానం 'ఐ5-319' టేకాఫ్ అయిన కాసేపటికే పక్షి ఢీకొట్టింది. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించి లక్నోలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. అనంతరం విమానాన్ని తనిఖీల కోసం పంపారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ లేదని అధికారులు తెలిపారు. ఇలాంటి ఘటనే ఈ నెల 18న జరిగింది. సింగపూర్ నుంచి ముంబై వస్తున్న విస్తారా విమానం 'ఎయిర్‌బస్ ఎ321'లో సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో విమానాన్ని వెనక్కి మళ్లించి చాంగి ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు.
ఎయిర్ ఏషియా విమానాన్ని ఢీకొట్టిన పక్షి !
January 29, 2023
0
Tags