ఛాట్ జీపీటీ తీరుపై సత్య నాదెళ్ల అభ్యంతరం !

Telugu Lo Computer
0


బెంగళూరులో ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ సమ్మిట్‌`లో మాట్లాడుతూ సత్యనాదెళ్ల.. ఛాట్ జీపీటీ తో చాటింగ్ నిర్వహించారు. పాపులర్ దక్షిణ భారత అల్ఫాహారాల జాబితా ఇవ్వమని కోరితే ఇడ్లీ వడ, దోశలతోపాటు బిర్యానీని సౌత్ ఇండియన్ టిఫిన్స్ జాబితాలో చూపెట్టింది ఛాట్ జీపీటీ. ఈ జాబితాతో తాను అంగీకరించబోనని సత్యనాదెళ్ల చెప్పారు. బిర్యానీని సౌత్ ఇండియన్ టిఫిన్‌గా పేర్కొంటూ సాఫ్ట్‌వేర్‌ తన ఇంటెలిజెన్స్‌ను అవమానించొద్దని పేర్కొన్నారు. దీంతో స్పందించిన ఛాట్ జీపీటీ వెంటనే క్షమాపణ చెప్పింది. `ఐయామ్ సారీ`, `మీరు చెప్పిందే నిజం` అని పేర్కొంది. ప్రజాదరణ పొందిన కృత్రిమ మేధ ఇంటెలిజెన్స్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌-చాట్‌రోబోట్‌ను ఛాట్ జీపీటీ అని పిలుస్తున్నారు. `ఓపెన్ ఏఐ` అనే సంస్థ గత నవంబర్‌లో ఛాట్ జీపీటీ అనే చాట్‌రోబోట్‌ను ప్రారంభించింది. డైలాగ్ ఫార్మాట్‌లో ఛాట్ జీపీటీ సమాధానాలు ఇస్తుంది. పొరపాట్లను అంగీకరిస్తుంది. సంబంధం లేని, తగని, అనుచిత ప్రశ్నలకు తిరస్కరిస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)