తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని గోవిందు పల్లె మహిళలు చిట్టీలు డబ్బుతో పరారైన వ్యక్తి పరువు తీయాలనుకున్నారు. దాని కోసం తమ వద్ద చిట్టీలు కట్టించుకుని డబ్బులతో పరారైన 'గాండ్ల వెంకన్న' అనే వ్యక్తి ఫోటోలతో ఫ్లెక్సీలు తయారు చేసిన జగిత్యాలలో రోడ్లమీద ఏర్పాటు చేశారు. గాండ్ల వెంకన్న అనే వ్యక్తి కనబడుటలేదు అని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. పై ఫోటోలోని వ్యక్తి పేరు గాండ్ల వెంకన్న ఈ వ్యక్తి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని కుటుంబంతో సహా పరార్ అయ్యాడు. ఆచూకి తెలిపినవారికి రూ.3 లక్షలు బహుమతి ఇస్తాం అంటూ బాధిత మహిళలు ప్రకటించారు. ఫ్లెక్సీలో బాధిత మహిళల ఫోన్ నంబర్లు కూడా ప్రింట్ చేయించారు. ఈ వ్యక్తి ఆచూకి తెలిస్తే ఈ నంబర్లకు ఫోన్ చేయమని కోరుతూ వారి ఫోన్ నంబర్లు ముద్రించారు. ఫోన్ చేయండీ రూ.3లక్షలు గెలుచుకోండి అంటూ ఫ్లెక్సీలో రాయించారు.
ఫోన్ చేయండి రూ.3 లక్షలు గెలుచుకోండి !
January 05, 2023
0
Tags