బీహార్లోని నవాదా జిల్లా పిప్రా గ్రామానికి చెందిన రాజురామ్ స్థానిక వేడుకల్లో డీజేగా పని చేసేవాడు. ఏడాదిన్నరగా 'డీమ్11'లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ యాప్ ద్వారా అతనికి ఎలాంటి ప్రయోజనం చేకూరకపోయినా ఏదో ఒక రోజు అదృష్టం తలుపుతట్టదా? అనే నమ్మకంతో, అందులో బెట్టింగ్ వేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే రాజురామ్ తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న బీపీఎల్ టోర్నీకి సంబంధించి రూ. 49తో పందెం కాశాడు. బ్రిస్బేన్ హిట్, సిడ్నీ థండర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో తనకు నచ్చిన ఉత్తమ ఆటగాళ్లతో జట్టుని ఎంపిక చేసుకున్నాడు. ఆ జట్టే అగ్రస్థానంలో నిలిచింది. దీంతో అతనికి రూ. 1 కోటి జాక్పాట్ తగిలింది. పన్నులకు రూ. 30 లక్షలు పోగా, మిగిలిన రూ. 70 లక్షలు రాజురామ్ ఖాతాలో జమ అయ్యాయి. ఈ జాక్పాట్ తగలడంతో రాజురామ్ కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగి తేలారు. తాను ఏడాదిన్నర నుంచి డ్రీమ్11లో పందెం కాస్తున్నానని, చివరికి ఇన్నాళ్ల తర్వాత తనకు అదృష్టం వరించిందని రాజురామ్ చెప్పుకొచ్చాడు. తనకొచ్చిన ఈ సొమ్ముతో సొంతంగా ఒక వ్యాపారం నిర్వహిస్తానని చెప్పాడు.
జాక్పాట్ కొట్టిన డీజే !
January 01, 2023
0
Tags