హిమాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ హస్తగతం

Telugu Lo Computer
0


హిమాచల్‌ ప్రదేశ్‌ లో కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించి ఏ పార్టీతో పొత్తు లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఆప్‌ కనీసం ఖాతా కూడా తెరవలేదు. ఈ నేపథ్యంలో హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ రాజీనామా చేశారు. తన రాజీనామాను గవర్నర్‌కు పంపినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రజల తీర్పును శిరసావహిస్తానని తెలిపారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రజల హామీలను నెరవేర్చాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడతామని తెలిపారు. మండీ జిల్లాలోని సిరాజ్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిపై జైరాం ఠాకూర్‌ గెలుపొందారు. మొత్తం 68 సీట్లకు గానూ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ఫిగర్‌ 35ను దాటేసింది. ఇప్పటికే 37 స్థానాల్లో స్పష్టమైన విజయం సాధించింది. మరో 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక బీజేపీ 23 స్థానాల్లో గెలుపొందగా.. 3 చోట్ల ముందంజలో ఉంది. ఇతరులు మూడు సీట్లను గెలుచుకున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)