అతిథులకు విమానాన్ని బుక్ చేసిన జంట

Telugu Lo Computer
0


రాజస్థాన్ లోని జైసల్మేర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్న ఓ జంట వినూత్నంగా ఆలోచించింది. పలు ప్రాంతాల నుంచి వచ్చే తమ బంధువులు, స్నేహితులకు కలిపి ఏకంగా ఓ విమానాన్నే బుక్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో పెళ్లికి వెళుతున్న వారంతా తమ సీట్లలో కూర్చొని, కేరింతలు కొడుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వీడియోను శ్రేయ సాహ్ అనే వ్యక్తి షేర్ చేయగా.. ఇప్పటివరకు ఈ వీడియోకు కోటికి పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తూ, భిన్నమైన కామెంట్లను జోడిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)