విజయవంతమైన లాలూ కిడ్నీమార్పిడి శస్త్రచికిత్స !

Telugu Lo Computer
0


ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ శస్త్రచికిత్స విజయవంతమైనట్టు లాలూ కుమారుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఓ ట్వీట్‌లో తెలిపారు. తన తండ్రితో పాటు, ఆయనకు కిడ్నీ ఇచ్చిన తన పెద్ద సోదరి రోహిణి ఆచార్య  కూడా శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్యంగా ఉన్నారని ట్వీట్‌ చేశారు. కొద్ది రోజులుగా లాలూతోనే తేజస్వి యాదవ్ సింగపూర్‌లో ఉంటున్నారు. ''విజయవంతంగా కిడ్నీ శస్త్రచికిత్స జరిగిన అనంతరం నాన్నగారిని ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూకు షిప్ట్ చేశారు. కిడ్నీ ఇచ్చిన అక్కతో పాటు, మా జాతీయ అధ్యక్షుడు (లాలూ) క్షేమంగా ఉన్నారు. వారి క్షేమం కోరుతూ ప్రార్థనలు చేసిన అందరికీ కృతజ్ఞతలు'' అని ట్వీట్‌లో తేజస్వి చెప్పారు. ఆసుపత్రిలో లాలూ వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. కాగా, లాలూ శస్త్రచికిత్స విజయవంతం కావాలని, త్వరగా ఆయన స్వస్థత చేకూరాలని కోరుకుంటూ బీహార్‌లోని పలు ప్రాంతాల్లో ప్రార్థనలు జరిగాయి. పాట్నాలోని ఆలయాల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)