ఢిల్లీలో బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం మధ్యాహ్నం ప్రారంభించారు. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో జరగనున్న ఈ సమావేశాలకు అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, పదాధికారులు, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, రాష్ట్రాల ఇన్చార్జులు హాజరయ్యారు. ప్రజా సంగ్రామయాత్రలో ఉండడంతో బండి సంజయ్ ఈ సమావేశాలకు హాజరుకాలేదు. పార్టీ బలోపేతానికి కావాల్సిన చర్యలపై చర్చించి.. పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పురంధేశ్వరి, డీకే అరుణ, లక్ష్మణ్, సత్యకుమార్, మురళీధరరావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, సోమువీర్రాజు ఈ సమావేశాలకు హాజరయ్యారు.
బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశాలు ప్రారంభం
December 05, 2022
0
Tags