ముంబైలోని శాంత్రాక్రూజ్ లో కవిత, కమల్ కాంత్ షా భార్యాభర్తలు నివసిస్తున్నారు. 2002లో వివాహం చేసుకున్న వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా కమల్ కాంత్ స్నేహితుడు హతేశ్ తో కవిత వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. దీంతో దంపతుల మధ్య తరచూ ఘర్షణ పడుతూ ఉండేవారు. ఈ నేపథ్యంలో ఆమె వేరుగా ఉంటుంది. గత కొన్ని రోజుల క్రితం కవిత తిరిగి భర్త వద్దకు వచ్చింది. పిల్లల భవిష్యత్ కోసం కలిసే ఉందామని భర్తను నమ్మించింది. కమల్ కాంత్ తల్లి కడుపునొప్పితో చనిపోయారు. కమల్ కాంత్ అడ్డు కూడా తొలగించుకుంటే ఆస్తి మొత్తం తమ సొంతమవుతుందని కవిత, ఆమె ప్రియుడు హితేశ్ భావించారు. కమల్ కాంత్ ను హత మార్చేందుకు ప్లాన్ వేశారు. కమల్ కాంత్ షా తినే ఆహారంలో ఆర్సెనిక్ కలవడం ప్రారంభించారు. అది స్లో పాయిజన్ గా మారడంతో కొంత కాలానికి అతని ఆరోగ్యం క్షీణించింది. తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న కమల్ ఆగస్టు 27న అంధేరీలోని ఆస్పత్రిలో చేర్చారు. మెరుగైన చికిత్స కోసం సెప్టెంబర్ 3న ముంబైకి తరలించారు. చికిత్స పొందుతూ నవంబర్ 19న కమల్ కాంత్ మరణించారు. పోలీసులు సహజ మరణంగా కేసు నమోదు చేశారు. కానీ, వైద్యుల రిపోర్టు పరిశీలించిన తర్వాత పోలీసులకు అనుమానం వచ్చింది. అతని శరీరంలో ఆర్సెనిక్, థాలియం ఉన్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు. కవితను తమదైన శైలిలో ప్రశ్నిస్తే అసలు విషయం తెలిసింది. పోలీసులు కవితను, ఆమె ప్రియుడిని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు.
ఆహారంలో విషం కలిపి భర్తను చంపిన భార్య !
December 04, 2022
0
Tags