హైదరాబాద్ లో ఓయూ పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో కారు నడిపిన యువకులు బీభత్సం సృష్టించారు. హబ్సిగూడలో ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో నుజ్జునుజ్జు అయింది. ఘటన సమయంలో ఆటోలో నలుగురు ప్రయాణిస్తున్నారు. ఆటోలో ఉన్న నలుగురిలో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడినవారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ లో కారు బీభత్సం !
December 04, 2022
0
Tags