గుజరాత్ లో కమలం - హిమాచల్ ప్రదేశ్ లో హస్తం

Telugu Lo Computer
0


గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 156 స్థానాల్లో విజయం సాధించింది.కాంగ్రెస్ పార్టీ 17, ఆమ్ ఆద్మీ పార్టీ 5 స్థానాల్లో, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు. గుజరాత్‌లో బీజేపీ విజయం సాధించడం ఇది ఏడోసారి. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. మొత్తం 68 స్థానాలకు ఎన్నికలు జరగగా, కాంగ్రెస్ 40 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 25 సీట్లు గెలుచుకుంది. ఇతరులకు 3 స్థానాలు దక్కగా, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క సీటూ గెలుచుకోలేకపోయింది. బీజేపీ కేవలం 1 శాతం కంటే తక్కువ ఓట్ల తేడాతో రాష్ట్రంలో ఓడిపోయిందని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ అన్నారు. రాష్ట్ర చరిత్రలోనే అతి తక్కువ ఓట్ల తేడాతో కాంగ్రెస్ గెలిచిందని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ తాను ఎన్నికల ఫలితాలను గౌరవిస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తమ ముఖ్యమంత్రిని త్వరలో ఎన్నుకుని, రాష్ట్ర అభివృద్ధిని కృషి చేయాలని చెప్పుకొచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)