గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేంద్ర పార్లమెంటరీ నేతలు రాజ్నాథ్ సింగ్, బీఎస్ యడియూరప్ప, అర్జున్ ముండా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో భూపేంద్ర పటేల్ పేరును కాను దేశాయి ప్రతిపాదించారు. భూపేంద్రకు పోటీగా సీఎం రేసులోకి ఎవరూ రాకపోవడంతో ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆయనకు మద్దతు తెలిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరమే తదుపరి ముఖ్యమంత్రి భూపేంద్ర పటేలేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. శనివారం జరిగిన తంతు కేవలం చట్టబద్ధంగా నిర్వహించిందే. ఇది కూడా పార్టీ అధిష్టాన ఆదేశాల అనుసారమే జరిగినట్లు సమాచారం. డిసెంబర్ 12న ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ఏకగ్రీవంగా ఎన్నిక
December 10, 2022
0
Tags