అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా తగ్గిన క్రూడాయిల్ ధరలు

Telugu Lo Computer
0


అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గాయి. క్రమక్రమంగా 80 డాలర్ల కంటే దిగువకు చేరుకుంటోన్నాయి. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్ ఒక్కింటికి 85.56 డాలర్లు పలికింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌లో ఈ ధర మరింత తక్కువగా కనిపించింది. 79.74 డాలర్ల వద్ద ట్రేడింగ్ నమోదైంది. శుక్రవారం నాటితో పోల్చుకుంటే వాటి ధరలో తగ్గదుల కనిపించింది. క్రూడాయిల్ ధర నేలకు దిగినప్పటికీ- పెట్రోల్, డీజిల్ రేట్లల్లో ఎలాంటి మార్పు లేకపోవడం పట్ల వాహనదారుల్లో అసహనం వ్యక్తమౌతోంది. ఇదివరకు ముడిచమురు ధరలకు అనుగుణంగా భారీగా పెంచుకుంటూ పోయాయి ఆయిల్ కంపెనీలు. ఇప్పుడు తగ్గించడానికి ససేమిరా అంటోన్నాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి విలువ 81.50 పైసలకు పైగా చేరిన నేపథ్యంలో- ఇంధన ధరల తగ్గింపు జోలికి వెళ్లట్లేదనేది స్పష్టమౌతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)