భారీగా కొకైన్‌ పట్టివేత !

Telugu Lo Computer
0


ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా కొకైన్‌ పట్టుబడింది. విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అడిస్‌ అబాబా నుంచి ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఈటీ-610లో వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ.9.8కోట్ల విలువైన 980 గ్రాముల కొకైన్‌ను సోమవారం స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. లోదుస్తుల్లో దాచి డ్రగ్స్‌ను తరలిస్తుండగా పట్టుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సదరు వ్యక్తిని అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)