భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ వెంటనే ఆపేయాలని కాంగ్రెస్ ఎంపీ, గోవా మాజీ ముఖ్యమంత్రి ప్రాన్సిస్కో సర్దిన్హా సలహా ఇచ్చారు. వెంటనే త్వరలో ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లో పర్యటించాలని ఆయన సూచించారు. బీజేపీని ఓడించగలిగే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని సర్దిన్హా చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 12న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడతాయి. గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. వాస్తవానికి ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది. అయితే ఎన్నికల ప్రచారంలో మాత్రం వెనుకబడింది. అందుకే గోవా మాజీ సీఎం ప్రాన్సిస్కో సర్దిన్హా ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్ర ఆపి ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని సలహా ఇచ్చారు.
రాహుల్‌జీ పాదయాత్ర ఆపి, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లో పర్యటించండి !
October 17, 2022
0
Tags