జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చేపట్టిన అధ్యయనంలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్ ఉన్న కుటుంబాలు 16 శాతం మాత్రమేనని, దేశంలో ఇప్పటికీ 50 శాతం కుటుంబాలకు ద్విచక్ర వాహనం లేదని, కేవలం 7 శాతం కుటుంబాలకు కారు ఉందని తెలిపింది. 49 శాతం భారతీయ కుటుంబాలకు ద్విచక్ర వాహనాలున్నాయని, 50.4 శాతం కుటుంబాలు సైకిల్‌పైనే ఆధారపడుతున్నాయని ఈ సర్వే చెప్పుకొచ్చింది. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్‌ల విషయానికొస్తే 68 శాతం ఇళ్లలో టీవీ, 38 శాతం మందికి ఫ్రిజ్, 18 శాతం కుటుంబాల్లో వాషింగ్ మిషన్ ఉన్నట్లు తేలింది. అలాగే దేశంలో సైకిల్, ద్విచక్ర వాహనం, కారు కూడా లేని కుటుంబాల సంఖ్య 24.7 శాతంగా ఉంది. 24 శాతం కుటుంబాలకు ఎయిర్ కండిషనర్లు లేదా ఎయిర్ కూలర్లు ఉన్నాయని స్పష్టం చేసింది.
50% పైగా కుటుంబాలకు సైకిలు ఆధారం !
October 20, 2022
0