కొత్తగా 2,756 కొవిడ్‌ కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 2,756 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా బారిన పడి ఐదుగురు  ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. కరోనా నుంచి 3,393మంది కోలుకున్నారు. కాగా, తాజా కేసులతో దేశంలో మొత్తం కేసులు 4.45కోట్లకు చేరాయి. ఇందులో 4.40కోట్లకు పైగా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు 5,28,799మంది బాధితులు కరోనాతో మరణించారు. ప్రస్తుతం దేశంలో 28,593 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక, దేశవ్యాప్తంగా 218కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)