కొత్తగా 2,141 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గత 24 గంటల్లో  2,51,515 నిర్ధారణ పరీక్షలు చేయగా 2,141 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,36,517 చేరింది. ప్రస్తుతం  25,510 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా కారణంగా 20 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,28,943కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.  మొత్తం కేసుల్లో 0.06 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.76 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 219.46 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)