ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీకి భద్రతను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఆయనకు థ్రెట్ ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీచేశాయి. దీంతో కేంద్ర హోం శాఖ జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రతను కల్పించింది. ఇదివరకు ఆయన్ జడ్ క్యాటగిరీ భద్రత ఉండేది. ఇప్పుడు జడ్ ప్లస్ క్యాటగిరీ ప్రొటెక్షన్ ఉండనుంది. నిఘా సంస్థలు ఇచ్చిన నివేదిక ప్రకారమే ముఖేశ్ భద్రతను జడ్ ప్లస్ కేటగిరీకి పెంచినట్లు కేంద్రం తన ప్రకటనలో పేర్కొంది. గతేడాది ముంబైలో గల ముఖేశ్ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో ముఖేశ్ భద్రతపై కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా చర్చలు జరిపింది. ఆ క్రమంలో ఆయన భద్రతను జడ్ ప్లస్ కేటగిరీకి పెంచాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో భాగంగా ముఖేశ్ అంబానీకి 55 మందితో భద్రత కల్పించనున్నారు. వీరిలో 10 మందికి పైగా ఎన్ఎస్‌జీ కమెండోలు ఉంటారు. ఇతర పోలీసు అధికారులు కూడా ఉంటారు.
ముఖేశ్ అంబానీకి జడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత
September 29, 2022
0