కన్నీరు పెట్టుకున్న ఐఏఎస్ అధికారి !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ఖేరిలో బస్సు - ట్రక్కు ఢీకొన్న సంఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారిని చూసి ఐఏఎస్ ఆఫీసర్ బోరున విలపించారు. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, మరో 41 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడ్డ వారంతా లఖింపూర్‌ఖేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లక్నో డివిజనల్ కమిషనర్ రోషన్ జాకబ్ గాయపడ్డ బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా గాయాలతో చికిత్స పొందుతున్న ఓ బాలుడిని చూసి రోషన్ జాకబ్ కన్నీరు పెట్టుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆమె వైద్యాధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)