చమురు కంపెనీలు వాణిజ్య సిలిండర్ ధరను మరోసారి తగ్గించాయి. ఢిల్లీలో రూ.25.50, కోల్‌కతాలో రూ.36.50, ముంబైలో రూ.35.50, హైదరాబాద్‌లో 36.5 తగ్గింది. తాజా తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్‌కు రూ.1885 చెల్లించాలి. గతంలో దీని ధర రూ.1976.50గా ఉండేది. వాణిజ్య సిలిండర్ ధర తగ్గడం ఇది వరుసగా ఆరోసారి. మే నెలలో రికార్డు స్థాయిలో రూ.2354కి చేరింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తోంది. సెప్టెంబరు 1న 91.50 రూపాయలు తగ్గించగా.. ఈ నెలలో మాత్రం 25.50 మేర దిగొచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో నిన్నటి వరకు రూ.1885గా ఉంటే.. ఇప్పుడు దాని ధర రూ.1859.50కి తగ్గింది. అదేవిధంగా కోల్‌కతాలో 1995.50 నుంచి 1959.50కి తగ్గింది, ముంబైలో 1844 నుంచి 1811, చెన్నైలో రూ.2045 నుంచి 2009కి ధరలు తగ్గాయి. 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ల విషయంలో మాత్రం.. ఈసారి కూడా ఎలాంటి మార్పు లేదు. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
తగ్గిన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర
October 01, 2022
0