ట్రేడింగ్‌ పేరిట భారీ మోసం

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని కూకట్‌పల్లి ప్రగతినగర్‌లో నివాసముంటున్న పి.కృష్ణ అనే వ్యాపారికి అదే ప్రాంతంలో నివాసముంటున్న నరేంద్రశర్మ, బి.రాజశేఖర్‌రెడ్డి అనే ఇద్దరితో ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. తమకు మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీ కాలనీలో గురుదత్తా ఎంటర్‌ప్రైజస్‌ పేరిట ట్రేడింగ్‌ సంస్థ ఉందని చెప్పాడు. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామని చెప్పడంతో కృష్ణ రూ.కోటి 65 లక్షలను ఏడాదికాలంగా నరేంద్రశర్మ, రాజశేఖర్‌రెడ్డిలకు ఇస్తూ వచ్చాడు. ఆరు నెలలుగా వడ్డీ చెల్లించకపోగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమంటే దాటేస్తూ వచ్చాడు. వారం రోజులుగా నిందితులు ఫోన్‌లో స్పందించకపోగా పత్తా లేకుండా పోయారు. తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు న్యాయం చేయాల్సిందిగా పోలీసులను ఆశ్రయించినట్లు ఎస్‌ఐ హారిక తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)