ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లాలో ఓ మత్స్యకారుడి వలకు భారీ చేప చిక్కింది. అది అక్షరాల రూ. 2 లక్షలకు వేలంలో అమ్ముడైంది. సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామానికి చెందిన మత్స్యకారుడి వలకు కచిడి అనే మగ చేప చిక్కింది. దీన్ని అంతర్వేది మినీ హార్బర్‌లో వేలం పాట పెట్టగా అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యాపారి రూ. 2 లక్షలకు సొంతం చేసుకున్నాడు. ఈ చేపలోని పొట్ట భాగాన్ని మందులలో ఉపయోగిస్తారని అందువల్ల ఈ చేప ఖరీదు అధికంగా ఉందని వ్యాపారి చెబుతున్నారు. ఈ చేప 23 కేజీల బరువుంది.
మత్స్యకారుడి వలకు చిక్కిన కచిడి చేప
July 11, 2022
0
Tags