ప్యాసింజర్ వాహనాల ధరలు పెంచిన టాటా మోటార్స్

Telugu Lo Computer
0


పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులను అధిగమించేందుకు ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచుతున్నట్లు టాటా మోటార్స్ తెలిపింది. వేరియంట్, మోడల్ ను దృష్టిలో పెట్టుకుని 0.55 శాతం ధరల పెంపు శనివారం నుంచి అమల్లోకి వస్తుందని దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం ప్రకటనలో పేర్కొంది. పెరిగిన ఇన్‌పుట్ ఖర్చులలో గణనీయమైన భాగాన్ని స్వీకరించడానికి కంపెనీ విస్తృతమైన చర్యలు తీసుకుందని పేర్కొంది. దేశీయ విపణిలో కంపెనీ పంచ్, నెక్సాన్, హారియర్‌తో పాటు సఫారీతో సహా పలు రకాల మోడళ్లను విక్రయిస్తోంది. ఈ నెలలో ఇప్పటికే వాణిజ్య వాహానాలపై 1.5 నుంచి 2.5శాతం వరకు ధరలు పెంచిన సంగతి తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)