కనిష్ఠ స్థాయికి పడిపోయిన విదేశీ మారక నిల్వలు !

Telugu Lo Computer
0


విదేశీ మారక నిల్వలు (ఫోరెక్స్) ఏకంగా 5 బిల్లియన్ డాలర్లు తగ్గాయి. దీంతో గత ఏడాది కాలంలో అత్యంత కనిష్ఠ స్థాయికి విదేశీ మారక నిల్వలు చేరుకున్నాయి. డాలర్ విలువ పెరగడం, రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ లో స్థాయికి పడిపోవడం దీనికి కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక మాంద్యం భయాలతో భారత స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ పోర్ట్ ఫోలియో మదుపర్లు భారీ ఎత్తున పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో రూపాయి విలువ తీవ్ర ఒత్తిళ్లకు లోనవుతోంది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రోజురోజుకూ క్షీణిస్తోంది. జులై 1 తేదీతో ముగిసిన వారానికి దేశంలోని విదేశీ మారక నిల్వలు 5.009 బిల్లియన్లు తగ్గి 588.314 బిల్లియన్ డాలర్లకు చేరిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. గత ఏడాది ఏప్రిల్ తర్వాత విదేశీ మారక నిల్వలు ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Post a Comment

0Comments

Post a Comment (0)