గుజరాత్‌లోని శరభండ గ్రామానికి చెందిన ముకేశ్‌భాయ్ అనే రైతుకు కొన్ని పశువులు ఉన్నాయి. ఎప్పటిలాగే సోమవారం సాయంత్రం కూడా పశువులను మేపడానికి బహిరంగ ప్రదేశానికి వెళ్లిన ఆయనకు పక్క ఊరి సరిహద్దు ప్రాంతంలో భూమిలో ఓ స్టీల్ డబ్బా ఉన్నట్టు గుర్తించారు. తొలుత దాన్ని తేలికగా తీసుకున్న ఆయన ఆ తర్వాత స్టీల్ బాక్సును భూమిలోంచి తీసి, ఓపెన్ చేశారు. అందులో సుమారు రూ.22వేలు ఉండటంతో కంగుతిన్నారు. వెంటనే సదరు గ్రామ సర్పంచ్ దగ్గరకు వెళ్లి విషయం వివరించారు. ఆ తర్వాత ఆ డబ్బు మున్నాభాయ్ అనే రైతువని తెలిసి మొత్తాన్ని ఆయనకు అప్పగించారు. ఇంటి మరమ్మత్తుల కోసం కష్టపడి సంపాదించిన డబ్బు గత ఏడాది వచ్చిన వరదల వల్ల కొట్టుకుపోయిందని, దీంతో కొన్ని రోజులు బాధపడి ఆ విషయాన్ని మర్చిపోయినట్టు చెప్పారు. అయితే సంవత్సరం తర్వాత డబ్బు తిరిగి తన వద్దకు చేరడంతో భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో.. ఆ డబ్బులోంచి కొంత డబ్బును దేవుని హుండీలో వేసిన మున్నాభాయ్, ఇంకొంత మొత్తాన్ని ముకేశ్‌భాయ్ ఇవ్వబోయారు. అయితే ఆ డబ్బును ముకేశ్‌భాయ్ సున్నితంగా తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ముకేశ్‌భాయ్ చేసిన పని ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశం అయింది. నెట్టింట్లో కూడా ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వైరల్ అవుతుండటంతో.. నెటిజన్లు ముకేశ్‌భాయ్‌ని అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
స్టీల్ డబ్బాలో డబ్బు...!
June 17, 2022
0
Tags