ఎస్ఐ చొక్కా పట్టుకున్న రేణుకా చౌదరి

Telugu Lo Computer
0


రాహుల్ గాంధీ ఈడీ వేధింపులకు నిరసనగా చలో రాజ్ భవన్ కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఖైరతాబాద్ సర్కిల్ వద్దకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను రాజ్ భవన్ కు వెళ్లనీయకుండా బారికేడ్లను అడ్డుపెట్టారు. ఖైరతాబాద్ లో కాంగ్రెస్ నేతల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీశాయి. ఈ నేపథ్యంలోనే మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఎస్ ఐ కాలర్ పట్టుకున్నారు . దీంతో కాంగ్రెస్ నేతలపై పోలీసులు సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ నేతలపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి తో పాటు భట్టి విక్రమార్క, రేణుకా చౌదరిలపై  పోలీసులు కేసు నమోదు చేయనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)