స్వల్పంగా తగ్గిన బంగారం ధర !
June 16, 2022
0
అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, బంగారానికి పెరుగుతున్న డిమాండ్ కారణంగా బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ వెళ్తున్నాయి. అందుకే.. పేద, మధ్యతరగతి జనాలు బంగారం కొనాలంటేనే దడుసుకుంటున్నారు. రోజురోజుకూ బంగారం, వెండి ధరలు పెరుగుతూ ఉన్నాయి తప్పితే తగ్గడం లేదు. మధ్యలో కొన్ని రోజులు తగ్గినా.. మళ్లీ పెరుగుతూనే ఉన్నాయి. మొన్న మాత్రం బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్న బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇవాళ బంగారం ధరలు తగ్గగా, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఒక గ్రాము బంగారం 22 క్యారెట్లకు ఇవాళ రూ.4715 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.25 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ఇవాళ రూ.47,150 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.250 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర రూ.5144 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.27 తగ్గింది. 10 గ్రాముల బంగారం రూ.51,440 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.270 తగ్గింది.