చంఢీఘడ్ కు చెందిన గుర్మీందర్ చీమా అనే వ్యక్తి మాల్కు వెళ్లాడు. ఆకలి వేయడంతో మాల్ లోని సాగర్ రత్న పుడ్ కోర్టుకు వెళ్లి అక్కడ ఫేమస్ డిష్ అయిన చోలే బటూరే ఆర్డర్ చేశారు. కాసేపటికి పుడ్ కోర్టు సిబ్బంది ఆర్డర్ సర్వ్ చేశారు. సగం పూరీ తిన్న తర్వాత గుర్మీందర్ కు భయంకరమైన అనుభవం ఎదురైంది. తాను తింటున్న పూరీ ప్లేటులో బతికున్న బల్లి దర్శనమిచ్చింది. తాను ఆర్డర్ చేసిన ఫుడ్ ప్లేటులో ఓ బల్లి పిల్ల అచేతన స్థితిలో కనిపించిండటంతో గుర్మీందర్ విషయాన్ని పుడ్ కోర్టు సిబ్బంది దృష్టికి తెచ్చాడు. ఆ తర్వాత చంఢీఘడ్ పోలీసులతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులకు కంప్లైంట్ చేయడంతో వారు ఆ శాంపిల్స్ను పరీక్షల కోసం పంపారు. గుర్మీందర్ చీమా ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేయగా వైరల్గా మారింది. ఫుడ్ కోర్టు తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.
పూరీ ప్లేటులో బతికున్న బల్లి
June 16, 2022
0
Tags