ముంబైలోని జుహు ప్రాంతంలో ఫైవ్‌స్టార్ హోటల్‌లో 35 ఏళ్ల రచయిత్రి పై 75 ఏళ్ల వ్యాపారవేత్త అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పైగా ఆ వ్యాపారవేత్త ఈ విషయాన్ని ఎవరికైన చెబితే చంపేస్తానంటూ డాన్ దావుద్ ఇబ్రహీం పేరుతో బెదిరించాడు. దీంతో ఇక ఆమె చేసేదిలేక ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు నిందితుడు బాధిత మహిళ వద్ద రూ.2 కోట్లు రుణం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆమె పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా, నిందితు డాన్ పేరుతో బెదిరించడమే కాకుండా చంపేస్తానని బెదిరించాడని పోలీసులకు తెలిపింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మహిళా రచయిత్రి పై అత్యాచారం
June 16, 2022
0
Tags