మహారాష్ట్రతో పాటు రాజస్థాన్‌లో హింస, అల్లర్లు జరిగే అవకాశంఉందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఈ మేరకు సీఆర్‌పీఎఫ్ 15 బెటాలియన్ల ర్యాపిడ్ ఫోర్స్ ను సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. దాదాపు 20వేల మంది జవాన్లు ఎయిర్‌లిఫ్ట్‌కు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అన్ని బెటాలియన్లలో అల్లర్లను అడ్డుకునేందుకు అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచాలని, అవసరమైన మేరకు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని వెంట తీసుకెళ్లాలని, అలాగే వాహనాలను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు బుధవారం కంపెనీ కమాండర్, కమాండెంట్లకు ప్రత్యేక బుధవారం ఆదేశాలు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపారు. ఫోర్స్ ఏదైనా నిర్ధిష్ట డ్యూటీ కోసం వాయుమార్గం, రోడ్డుమార్గాల్లో వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తున్నది. ఏ బెటాలియన్‌లోనూ సైనికుల సంఖ్య తక్కువగా ఉండకూడదని కంపెనీ కమాండర్, కమాండెంట్లకు ప్రత్యేక సూచనలు ఇచ్చినట్లు ఇచ్చారు.
మహారాష్ట్ర, రాజస్థాన్‌లకు భారీగా భద్రతా బలగాలు !
June 29, 2022
0
Tags