ఫోన్ మోగితే సీజ్‌ !

Telugu Lo Computer
0


సభా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఎవరి ఫోన్ మోగినా ఆ ఫోన్‌ను సీజ్ చేస్తామని ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సతీశ్ మహానా  ఎమ్మెల్యేలను హెచ్చరించారు. సభ జరుగుతున్న సమయంలో ఫోన్లను స్విచాఫ్ చేయాలని ఆయన సూచన చేశారు. ఇవాళ ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో ఓ సభ్యుడి ఫోన్ మోగింది. ఈ ఘటన పట్ల స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదు అని, ఇక నుంచి ఎవరి ఫోన్ మోగినా, దాన్ని సీజ్ చేస్తామని స్పీకర్ తన వార్నింగ్‌లో తెలిపారు. సభ జరుగుతున్న సమయంలో కచ్చితం సభ్యులందరూ మొబైల్ ఫోన్లను స్విచాఫ్ చేయాలని సూచన చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)