పానీ పూరి తిన్న చిన్నారులకు అస్వస్థత !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్ లోని  సింగర్పూర్‌లో గిరిజనులు అధికంగా ఉండే  ప్రాంతంలో శనివారం రాత్రి జాతర జరిగింది. జాతరలో ఒకే షాపులో పానీ పూరీ తిన్న 97 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపు నొప్పితో చిన్నారులు ఆస్పత్రిలో చేరినట్లు జిల్లా ఆసుపత్రి సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ కెఆర్‌ శాక్య తెలిపారు. చిన్నారులు ప్రాణాపాయం తప్పిందని, వారంతా క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. మరోవైపు జాతరలో 'పానీ పూరీ' ని అమ్మిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని, శాంపిల్స్ ను పరీక్షల నిమిత్తం పంపినట్లు పోలీసు అధికారి తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)