ఉత్తరప్రదేశ్ లో జరిగే రాంపూర్ లోక్‌సభ ఉప ఎన్నికలోపోటీ చేయకూడదని బీఎస్పీ అధినేత్రి మాయావతి నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం పలువురు కీలక నేతలతో భేటీ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మాయావతి ఈ విషయంపై ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జూన్ 23 న రాంపూర్ లోక్‌సభ సీటుతో పాటు ఆజంగఢ్ సీటుకు కూడా ఉప ఎన్నిక జరగనుంది. 26న ఫలితాలను విడుదల చేస్తామని ఈసీ పేర్కొంది.
రాంపూర్ ఉప ఎన్నికకు బీఎస్పీ దూరం
May 29, 2022
0
Tags