కర్ణాటక తూముకూరు జిల్లా పావగడ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంకట రమణప్ప తన నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటనకు వెళ్లారు. ఓ గ్రామంలోని యువకుడు.. ఎమ్మెల్యేను నిలదీశాడు. రోడ్డు వేయిస్తానని మాట ఇచ్చి ఓట్లు వేయించుకొన్నారు.. ఇంతకువరకు రోడ్డు ఎందుకు వేయలేదని ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే యువకుడిపై చేయిచేసుకున్నారు. అంతేకాదు కాదు బూతులు తిడుతూ పోలీసులకు పట్టిస్తానని బెదిరించాడు. ఈ ఊహించని పరిణామంతో అక్కడున్న ప్రజలు, అధికారులు అవాక్కయ్యారు .ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు ఆ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే చాలా పెద్దాయన అని అందుకే తనను కొట్టినా వదిలేశానని, తనకేం భయం లేదని ఆ యువకుడు చెప్పాడు.
రోడ్డు వేయమనందుకు యువకుడి చెంప చెల్లుమనిపించిన ఎమ్మెల్యే !
April 22, 2022
0
Tags