నల్ల నువ్వులను పెరుగులో కలిపి రాస్తే జుట్టు రాలదు !

Telugu Lo Computer
0

 


మూడు స్పూన్ల నల్ల నువ్వులను శుభ్రంగా కడిగి నీటిలో రాత్రంతా  నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నానిన నువ్వులను మెత్తని పేస్ట్ గా చేసి ఈ పేస్ట్ లో ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ ఆలోవెరా జెల్, ఒక స్పూన్ నువ్వుల నూనె, అర స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి గంట తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో ఒకటి లేదా రెండు సార్లు చేయాలి. ఈ విధంగా చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గటమే కాకుండా చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. జుట్టు కుదుళ్లు బలంగా మారి జుట్టు రాలటం అగుతుంది. నల్ల నువ్వులలో ఉన్న పోషకాలు జుట్టు రాలకుండా చేయటమే కాకుండా తెల్లజుట్టును నల్లగా మారుస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)