1300 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

Telugu Lo Computer
0


గుజరాత్ లోని కచ్​ జిల్లాలోని కండ్లా పోర్టుకు సమీపంలో ఉన్న కంటెయినర్​ స్టేషన్​లో డ్రగ్స్ ఉన్నాయంటూ గుజరాత్​ యాంటీ టెర్రరిస్ట్​ స్క్వాడ్​(ఏటీఎస్​)కు విశ్వసనీయవర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో డైరెక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇంటెలిజెన్స్​(డీఆర్​ఐ) కలిసి రంగంలోకి దిగిన ఏటీఎస్ అధికారులు కండ్లా పోర్ట్​లోని కంటెయినర్​ స్టేషన్​లో తనిఖీలు చేపట్టారు. అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలోనే కంటెయినర్​ లోపల భారీగా హెరాయిన్ దాచి తరలిస్తుండగా పట్టుకున్నారు. కంటైనర్ తెరిచి చూడగా అందులో 260 కిలోల హెరాయిన్​ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీని విలువ రూ.1300 కోట్లుగా ఉంటుందని డీఆర్​ఐ అధికారులు వెల్లడించారు. గతంలో ముంద్రా పోర్టులో రెండు కంటెయినర్లలో రూ.21 వేల కోట్ల విలువైన 2,988 కిలోల హెరాయిన్ ను అధికారులు పట్టుకున్నారు. 2021 సెప్టెంబర్​లోనూ డ్రగ్స్​ సీజ్​ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)