దేశంలో 1,150 కొత్త కరోనా కేసులు నమోదు !

Telugu Lo Computer
0


దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. మరోసారి రోజువారీ కేసుల సంఖ్య వెయ్యి దాటింది. గడిచిన 24 గంటల్లో 1,150 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసుల సంఖ్య 11,558కి పెరిగింది. అలాగే ఒక్క రోజులో నలుగురు మరణించారని, మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,21,751కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ముందు రోజు నమోదైన కేసులతో పోలిస్తే గడిచిన 24 గంటల్లో కొత్త కేసులు 17 శాతం పెరిగాయి. శనివారం కేంద్ర ప్రభుత్వం 975 కేసులను ప్రకటించగా.. ఒక్క రోజులో 175 అదనంగా పెరిగి ఆదివారం 1150 కేసులు వచ్చినట్లు పేర్కొంది. ఇక గడిచిన వారంలో 6,826 కరోనా కేసులు నమోదయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)