భార్యను బండరాయితో కొట్టి చంపిన భర్త

Telugu Lo Computer
0


తెలంగాణ లోని రంగారెడ్డి జిల్లా నందిగామలోని వెంకమ్మగూడలో బాలరాజు (35), సునిత అలియాస్ సరిత (30) దంపతులు నివసిస్తున్నారు. వీరు కూలి పని చేసేవారు. వారికి మూడేండ్ల కుమార్తె కూడా ఉంది. అయితే వీరిద్దరి మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి కూడా దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం సరిత నిద్రించిన తర్వాత మద్యం మత్తులో ఉన్న భర్త ఆమెపై బండరాయితో మోది చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకు న్నారు. బాలరాజును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


Post a Comment

0Comments

Post a Comment (0)