వైభవంగా పెళ్లి చేసుకోవడానికి బ్యాంకు కన్నం !

Telugu Lo Computer
0


కర్నాటకలోని బెళగావి జిల్లాలోని సవదత్తి తాలూకా, మురుగోడు డీసీసీ బ్యాంకులో మార్చి 6వ తేదీన భారీ దొంగతనం జరిగింది. ఈఘటనలో ఆరు కోట్ల విలువ గల బంగారం, నగదును దుండగులు దోచుకెళ్లారు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దొంగతనం జరిగిన తీరును చూసి ఇది ఇంటి దొంగల పనే అని తేల్చారు. అనుమానితుడైన బ్యాంకులో పని చేస్తున్న క్లర్క్‌ బసవరాజు సిద్ధంగప్ప హుణిసికట్టి (30)ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. అతడి అనుచరులు సంతోష్‌ కాళప్ప కుంబార (31), గిరీశ్‌ (26) లతో కలిసి దొంగతనం చేసినట్లు అంగీకరించాడు. వారి వద్దనుంచి నాలుగు కోట్ల 20 లక్షల రూపాయల నగదు, రూ. కోటి 63 లక్షల విలువచేసే మూడు కేజీల బంగారు నగలను, ఒక కారు, బైకును స్వాధీనం చేసుకున్నారు. నకిలీ తాళాల్ని ఉపయోగించి దుండగలు చోరీ చేశారు. దోచుకున్న సొత్తును జిల్లాలోని రామదుర్గ తాలూకా తోరణగట్టి గ్రామంలోని వ్యవసాయ తోటలో పాతి పెట్టారు. తన పెళ్లిని వైభవంగా చేసుకోవడానికి డబ్బు అవసరం అయి ఈ చోరీకి చేసినట్లు పాల్పడినట్లు క్లర్క్‌ బసవరాజు విచారణలో పోలీసులకు తెలిపాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)