టీ అంటే ఇష్టం లేనివారు దరిదాపు ఉండరు. మనం ఉదయం లేవగానే టీ తాగాల్సిందే. టీ తాగకుంటే వారికి ఏ పని తోచదు. మనకు తలనొప్పి వచ్చిన ఏ సమస్య వచ్చిన మనం మొదటగా టీ తాగుతారు. అయితే కొంత మంది టీ మూడు నుంచి నాలుగు సార్లు తాగుతుంటారు. టీ అధికంగా తీసుకోవడం వల్ల లావఫుతారు. అందుకు ప్రధాన కారణం టీలో కేలరీలు అధికంగా ఉండడం. ఈ విషయం తెలియక చాలా మంది రోజుకు రెండు, మూడు సార్లు తాగుతుంటారు. చాలా మంది టీని పెట్టుకునేటప్పుడు కొద్దిగా అల్లం లేదా ఇలాచి వాడుతుంటారు. నిజానికి ఇలా చేయడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. అలానే ఆరోగ్యానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కనుక టీని పెట్టుకునేటప్పుడు కొంచెం తులసి కానీ యాలకులు కానీ లవంగాలను కానీ వేసుకోవడం వల్ల దానిలో పోషక పదార్థాలు పెరుగుతాయి. అదే విధంగా మెటబాలిజంకి ఉపయోగ పడుతుంది. బరువుని అదుపులో ఉంచడానికి కూడా ఇది దోహద పడుతుంది. ముఖ్యంగా లవంగాలు కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి. బాగాలావై పోతున్నామని అనుకునే వాళ్లు క్యాలరీలను తగ్గించుకోవడానికి ఫ్యాట్ మిల్క్ కాకుండా చూసుకోండి. ఎక్కువ కొవ్వు ఉండే పాలని ఉపయోగించడం వల్ల లావైపోతారు. కావాలంటే ఓట్స్ మిల్క్, ఆల్మండ్ మిల్క్ లేదా సోయా మిల్క్ వాడొచ్చు. అదే విధంగా క్రీమ్ ఉండే పాలకు దూరంగా ఉండటం మంచిది. ఇలా చేయడం వల్ల కూడా క్యాలరీలు తగ్గుతాయి. పైగా బరువు పెరిగి పోకుండా ఉండడానికి కూడా అవుతుంది. టీ మానలేక పోతే దానిలో ఉండే చక్కెర శాతాన్ని తగ్గించండి. వీలైతే చక్కెర లేకుండా తాగడం మంచిదే. చక్కెరను తగ్గిస్తే కేలరీలు కూడా తగ్గుతాయి. కావాలి అనుకుంటే చక్కెరని తగ్గించి అందులో బెల్లం కానీ తేనె కానీ వేసుకోండి. ఇలా చేయడం వల్ల తియ్యదనం వస్తుంది. అలాగే చక్కెర వల్ల కలిగే నష్టాల నుండి కూడా దూరంగా ఉండొచ్చు.
టీ అధికంగా తాగుతున్నారా?!
March 04, 2022
0