సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో డీసీపీ హోదాలో ఉన్న అధికారి ఇటీవల మాదాపూర్‌లోని ఓ హుక్కా కేంద్రం గురించి తెలుసుకున్నారు. అక్కడ మత్తు పదార్థాలను విక్రయిస్తున్నారని పక్కా సమాచారాన్ని సేకరించి స్వయంగా పరిశీలించేందుకు ఎవరికీ తెలియకుండా సివిల్ దుస్తుల్లో అక్కడికి వెళ్లారు. కొన్ని నిమిషాల పాటు అక్కడ జరుగుతున్న వ్యవహారాలను నిశితంగా గమనించి ఆ తర్వాత తన సిబ్బందికి వెంటనే స్పాట్‌కు రావాలంటూ వాట్సాప్ మెసేజ్ పెట్ లైవ్ లొకేషన్ షేర్ చేశారు. ఆ సందేశంలో ఎక్కడ కూడా హుక్కా కేంద్రం పేరు పెట్టలేదు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన బయలుదేరారు. తన సిబ్బందికి ఎప్పటికప్పుడు లొకేషన్‌ను షేర్ చేసుకుంటూ హుక్కా సెంటర్‌లో నడుస్తున్న తతంగాన్ని గమించిన డీసీపీ సిబ్బంది చేరుకుగానే లేచి నిలబడిన చప్పట్లు కొట్టారు. ఏ ఒక్కరూ ఇక్కడి నుంచి కదలవద్దని హెచ్చరించారు. ఈ హఠాత్ పరిణామానికి హుక్కా నిర్వాహకులు, అక్కడ ఉన్న వారంతా కంగుతున్నారు. హుక్కా సేవిస్తున్న వారు, నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు దందాను ఆపివేయించారు. డీసీపీ స్థాయి అధికారి స్వయంగా రంగంలోకి దిగడంతో ఇప్పుడు ఈ అంశం పోలీసు వర్గాల్లోనే హాట్ టాపిక్‌గా మారింది.
హుక్కా సెంటర్ కి స్వయంగా వెళ్లిన డీసీపీ
March 04, 2022
0
Tags