చత్తీస్‌గఢ్ లోని రాయగఢ్ లో కొంతమంది శివుడి గుడి కట్టడానికి సంకల్పించారు. అందుబాటులో ఉన్న ఓ భూమిలో నిర్మాణపనులు ప్రారంభించారు. అయితే దీనిపై సుధా రజ్వాడే అనే మహిళ అభ్యంతరం చెప్పింది. బిలాస్‌పూర్ హైకోర్టులో పిటిషన్ వేసింది. 16 మంది కలిసి ప్రభుత్వ భూమిని ఆక్రమించి గుడి నిర్మిస్తున్నారంటూ ఆరోపించింది. ఇందులో ముక్కంటిని కూడా చేర్చింది. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు వెంటనే దర్యాప్తు చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం స్థానిక తహసీల్దార్ ఆఫీసుకు దర్యాప్తు చేయాలని చెప్పింది. ప్రాథమిక విచారణ పూర్తిచేసి అందుబాటులో ఉన్న ఓ చట్టాన్ని బయటకు తీసి శివుడితో సహా అందరికీ నోటీసులిచ్చాడు. ఈ నెల 25 న విచారణకు హాజరై భూకబ్జా ఆరోపణలపై వివరణ ఇవ్వాలన్నాడు. విచారణకు హాజరుకాకుంటే చర్యలు తప్పవని.. భూమిని ఖాళీచేయించడంతో పాటు పదివేల జరిమానా విధిస్తామని హెచ్చరించాడు. దీంతో శివలింగాన్ని పెకిలించి ట్రాలీలో వేసుకొని విచారణకు తీసుకుపోయారు. విచారణ అనంతరం కేసును వాయిదావేశారు. శివలింగాన్ని విచారణకోసం తీసుకుపోతున్న ఫోటోలు ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇప్పుడా ఫోటోలు వైరల్ గా మారాయి.
కోర్టుకు హాజరైన శివ లింగం!
March 27, 2022
0